Get Job with any degree in Bank

636067844587364107

  • మొత్తం పోస్టులు 19243.. 
  • ఏపీ- 699, తెలంగాణ- 546.. మెయిన్‌లో టైమ్‌ లిమిట్‌
దేశంలోని జాతీయ బ్యాంకుల్లో క్లరికల్‌ పోస్టుల భర్తీకి ఐబిపిఎస్‌ భారీ ఎత్తున నోటిఫికేషన్ వెలువడింది. జాతీయ స్థాయిలో మొత్తం ఖాళీలు 19243 ఉండగా కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 546 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 699 పోస్టులు ఉన్నాయి. అయితే రెండు రాష్ట్రాల్లో 19 బ్యాంకుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. రిక్రూట్‌మెంట్‌ విధానంలోనూ ఐబిపిఎస్‌ కొద్ది పాటి మార్పులు చేసింది. ప్రిలిమినరీ, మెయినగా పరీక్షించే పద్ధతిని యథాతథంగా ఉంచింది. అయితే మెయినలో వివిధ టెస్టులకు ఇచ్చే సమయాన్ని ఉమ్మడిగా కాకుండా దేనికది విడిగా కేటాయించింది. నిర్దేశిత సమయంలోనే సబ్‌ టెస్ట్‌ను అభ్యర్థి పూర్తి చేయాలి. ఈ ఏడాది నోటిఫికేషనలో కనిపించిన ప్రధాన మార్పు ఇది. అలాగే మెయినలో 200 మార్కులకు పేపర్‌ వివిధ టెస్టుల సమాహారంగా ఉంటుంది. దాన్ని 100 మార్కులకు లెక్కించి మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. వారికి రీజనల్‌ లాంగ్వేజ్‌లో కూడా టెస్ట్‌ నిర్వహించి ఆయా బ్యాంకులకు అలాట్‌ చేస్తారు. ఇంటర్వ్యూ మాత్రం ఉండదు. క్లరికల్‌ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూ ఉండరాదన్న విధానాన్ని గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్ నుంచే అమలు చేస్తున్నారు.
వివిధ జాతీయ బ్యాంకుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18)లో ఏర్పడే ఖాళీలన్నింటినీ ఈ నోటిఫికేషన కిందే భర్తీ చేయనున్నారు. ప్రతి రిజర్వుడు కేటగిరిలో కనీసం పది శాతం మందిని అదనంగా ఎంపిక చేసి అందుబాటులో ఉంచుతారు. అంటే 2018 మార్చి 31 వరకు ఏర్పడే ఖాళీలను ఈ నోటిఫికేషన కింద ఎంపికయ్యేవారితోనే భర్తీ చేస్తారు. ప్రభుత్వం నిర్దేశించే నిబంధనలకు లోబడి యావత్తు భర్తీ ప్రక్రియ ఉంటుంది.
మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ కటాఫ్‌. గత ఏడాది నోటిఫికేషన ప్రకారం ప్రిలిమినరీ రాసిన వారిలో ఏపీలో 50.75 శాతం, తెలంగాణలో 31 శాతం మార్కులు పొందిన అభ్యర్థులు మెయిన ఎగ్జామ్‌కు అర్హత సాధించారు.
 
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి సెప్టెంబరు 12 నాటికి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌ మీద ఆపరేటింగ్‌ & వర్కింగ్‌ నాలెడ్జ్‌ ఉండాలి. అంటే కంప్యూటర్‌ ఆపరేషన్స్/ లాంగ్వేజ్‌ విభాగాల్లో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ ఉండాలి. హైస్కూలు/ కాలేజ్‌/ యూనివర్సిటీ స్థాయిలో కంప్యూటర్‌ / ఇన్ఫర్మేషన టెక్నాలజీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. అభ్యర్థి ఎంచుకునే ప్రాంతానికి సంబంధించిన స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి.

వయసు: ఆగస్టు 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఒబిసిలకు మూడేళ్లు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు పదేళ్లు, విడో్‌స/డైవోర్స్‌డ్‌ విమెనకు తొమ్మిదేళ్ల సడలింపు ఇచ్చారు.
 
దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ ఎక్స్‌ సర్వీ్‌సమెన అభ్యర్థులకు రూ.100 మాత్రమే)
 
ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన పట్టికను వెబ్‌సైట్‌లో ఉంచిన నోటిఫికేషనలో చూడవచ్చు.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష కేద్రాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరీక్ష కేంద్రాలు:
చీరాల, చిత్తూరు, గుంటూరు, హైదరాబాద్‌, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం

తెలంగాణ రాష్ట్ర పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌

సిఎస్‌ఐఆర్‌ – యూజీసీ నెట్‌
కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండసి్ట్రయల్‌ రీసెర్చ్‌ (సిఎ్‌సఐఆర్‌), యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన (యుజిసి) సంయుక్తంగా నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌)ను డిసెంబర్‌ 18న హైదరాబాద్‌, గుంటూరు సహా పలు కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. జూనియర్‌ లెక్చరర్‌షిప్‌/ లెక్చరర్‌షి్‌పనకు ఉద్దేశించిన టెస్ట్‌ ఇది. కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌, అట్మాస్ఫియరిక్‌, ఓషన అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, మేథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సె్‌సలో ఈ టెస్ట్‌ జరుగుతుంది. ఫలితాలు వెలువడిన తరవాత రెండేళ్ళ పాటు స్కోర్‌కు వ్యాలిడిటీ ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 9లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వెబ్‌సైట్‌: www:csirh rdg.res.in
 

ఇండియన్ నేవీలో ఇంజనీర్లకు అవకాశాలు
ఇండియన్ నేవీలో ఇంజనీర్లకు సంబంధించిన ఉద్యోగ ప్రకటన వెలువడింది. వివిధ టెస్టుల అనంతరం ఎంపికైన అభ్యర్థులు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్డ అధికారులుగా ఎగ్జిక్యూటివ్‌, టెక్నికల్‌ బ్రాంచుల్లో నియమితులవుతారు. నిర్దేశిత శారీరక, వయస్సుకు సంబంధించిన అర్హతలకు తోడు ఆయా బ్రాంచుల్లో బిఇ/బిటెక్‌ ఉత్తీర్ణులు ఈ పోస్టులకు అర్హులు. ఒక్క ఐటి విభాగానికి మాత్రం బిసిఎ/ ఎంసిఎ/ బిఎస్సీ(ఐటి) ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలో సాధించిన మార్కులకు కటాఫ్‌ నిర్ణయించి షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు బెంగళూరు/ భోపాల్‌/ కోయంబత్తూర్‌/ విశాఖపట్టణంలో ఎస్‌ఎ్‌సబి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. చివరగా మెడికల్‌ టెస్ట్‌ కూడా జరిపి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 16 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: www:joinindiannavy.gov.in
 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s